గుడిసెలు లేని జిల్లాగా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

గుడిసెలు లేని జిల్లాగా మారుస్తాం

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టి.. 2.5లక్షల ఎకరాలకు నీరందిస్తాం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల మంజూరుకు శ్రీకారం సీఎం పర్యటనతో శ్రేణుల్లో జోష్‌

రెబ్బెన/ఆసిఫాబాద్‌: పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ గిరిజన గూడెం, తండాలో గిరిజనులందరికీ నూరుశాతం ఇళ్లు మంజూరు చేసి, అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయాలనేదే మా ఆలోచన అని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నా రు. ఏ అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా ఈ గడ్డ నుంచే ప్రారంభిస్తున్నామని, సంవత్సరంలోగా గుడిసెలు లేని జిల్లాగా ఉమ్మడి ఆదిలాబా ద్‌ను మారుస్తామని అన్నారు. రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట బహిరంగ సభకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, వేంనరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, వెడ్మ బొజ్జు, గడ్డం వినోద్‌తో కలిసి హాజరయ్యారు. జిల్లాలో రూ.112 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మావోయిస్టు నగేశ్‌ దంపతులతోపాటు పలువురు లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత కార్యక్రమాన్ని ఈ వేదిక మీద నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

తుమ్మిడిహెట్టితో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ చేపట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని తెలిపారు. ఎలాంటి ఎత్తిపోతలు, విద్యుత్‌ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే సాగునీరందిస్తామని అన్నారు. ఈ విషయంలో రైతులకు అన్యాయం చేయాలని చూస్తే రైతాంగం ఉప్పైనె కదులుతుందని హెచ్చరించారు.

ఆద్యంతం.. ఉత్సాహభరితం

ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌ నుంచి నేరుగా కెరమెరి మండలం కొత్తగూడకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సభాస్థలి జనసంద్రంగా మారింది. రాత్రి 7.45 గంటల నుంచి గంటన్నరకు పైగా కొనసాగింది. మంత్రులు మాట్లాడిన అనంతరం సీఎం ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు వరిధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్‌ కొనుగోళ్లు విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో మంచిర్యాలకు వెళ్లారు. అయితే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు ప్రత్యేక వరాలేవీ ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసింది. ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో ఎస్పీలు నితిక పంత్‌, అఖిల్‌ మహాజన్‌ భద్రతను పర్యవేక్షించారు.

రెండో విడత ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

బహిరంగ సభకు హాజరైన జనం

ప్రేంసాగర్‌రావుకు పెద్దపీట

సభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావుకు ప్రత్యేక స్థానం దక్కింది. సభాస్థలికి చేరుకోగానే సీఎం ప్రేంసాగర్‌రావును వెంటబెట్టుకుని సభావేదికపైకి వచ్చారు. స్టేజీపై పక్కనే కూర్చొబెట్టుకున్నారు. ప్రేంసాగర్‌రావు జిల్లాలోని సమస్యలతోపాటు పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలకు కొండాలక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టాలని, మంచిర్యాలలో ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలని విన్నవించారు.

సభను బహిష్కరించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

బహిరంగ సభ మధ్య నుంచి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ అధికారికంగా నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఐదుగురు మంత్రుల ప్రసంగం అనంతరం తనకు అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అవకాశం దక్కలేదన్నారు.

అర్హులందరికీ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతాం. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు, తండా ప్రజల కష్టాలు కనిపించలేదు. పేదోడి కష్టాన్ని ప్ర త్యక్షంగా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని 4.5లక్షల ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేశారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా మంజూరు చేశాం. గత 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, 2.5 ఏళ్ల ప్రజాపాలన ప్రభుత్వానికి తేడా ఇదే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మరో 2.5లక్షల ఇళ్లను అందిస్తాం.

– పొంగులేటి శ్రీనివాసరెడ్డి,

రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి

Advertisement
 
Advertisement
Advertisement