చరిత్రలో నిలిచేలా ముఖ్యమంత్రి సభ | - | Sakshi
Sakshi News home page

చరిత్రలో నిలిచేలా ముఖ్యమంత్రి సభ

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

● ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాకు తొలిసారి వస్తు న్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని సీఎం సభ కన్వీనర్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద బహిరంగ సభ, కెరమెరి మండలం కొత్తగూడలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించా రు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అతిథి గృహంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభను తలపించేలా జిల్లాలో సభ నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలోని ప్రతీ హామీ అమలు చేస్తున్నామని, ప్ర తిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు అనవసర ఆరో పణలు చేస్తున్నారన్నారు. వర్షాకాలం తర్వా త కుమురంభీం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. వట్టివాగు ప్రాజక్టుకు రూ.13కోట్లు కేటాయించా మని గుర్తు చేశారు. ఆదిలాబాద్‌ ఎక్స్‌రోడ్డు నుంచి ఉట్నూర్‌ వరకు నాలుగు వరుసల రహదారి, గుండి, అనార్‌పల్లి వంతెనల నిర్మాణం నిధులకు సీఎంను ఒప్పిస్తామని తెలిపారు. 2029లో 100 సీట్లు గెలవడం లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. రేషన్‌కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ భరోసా కింద ఇన్సూరెన్స్‌ అమలు చేస్తామని, సీఎం సభలో ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ ఇరులకు మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, నాయకులు తారీఖ్‌, మల్లేశ్‌, బాలేశ్‌గౌడ్‌, మహేశ్‌గౌడ్‌, శంకర్‌, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement