ఆసిఫాబాద్: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని భద్రతా అధికారులు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భద్రతాధికారులు శ్రీనివాసరావు, ప్రభాకర్‌రావు, కలెక్టర్ కె హరిత, ఎస్పీ నితిక పంత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, అదన పు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్‌కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతాధికారులు మాట్లాడుతూ కెరమెరి మండలం కొలమ్ కొటారికి సీఎం హెలికాప్టర్‌లో ద్వారా వస్తున్నందున అగ్ని మాపక వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపంలో బహిరంగ సభ స్థలం వద్ద రెండు అగ్ని మాపక శకటాలు అందుబాటులో ఉంచాలన్నారు. సీఎం పర్యటనలో విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలని, వైద్యాధికారులు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కెరమెరి: రైతులు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని ఆదివా సీ భవన్‌లో ఆదివారం ఉట్నూర్ జీసీసీ డీఎం సందీప్‌కుమార్‌తో కలిసి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారులకు అ మ్మకుండా, కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం పంట విక్రయించి రైతులను శా లువాతో సత్కరించారు. కార్యక్రమంలో జీసీ సీ మేనేజర్ తారాచంద్, సర్పంచులు ఆనంద్‌రావు, నాగ్‌నాథ్, రాధాబాయి, నాయకులు పెందోర్ మోతీరాం, దుర్పతబాయి, అబ్దుల్ కలాం, యూనూస్, బాలాజీ, అంబాజీ పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జొన్నలు తూకం వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి