బెల్లంపల్లి ఏరియా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి ఏరియా ఉత్తమ ఉద్యోగుల ఎంపిక

Jun 1 2026 4:01 AM | Updated on Jun 1 2026 4:01 AM

ప్రజ్వల శ్రీ

రెబ్బెన: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి సాధన, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ ఉద్యోగులను ఏరియా యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్‌ స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా క్లోజ్డ్‌ మైన్స్‌ ఇన్‌చార్జి మేనేజర్‌ పి.మహేష్‌కుమార్‌ ఎంపికయ్యారు. ఏరియా స్థాయిలో ఖైరిగూర ఓసీపీలో ఈపీ ఫిట్టర్‌ ఆకుల రవి, ప్రత్యేక ఉత్తమ ఉద్యోగులుగా ఖైరిగూర ఓసీపీ అడిషనల్‌ మేనేజర్‌ గౌతం రాజేష్‌రెడ్డి, సీనియర్‌ పర్సనల్‌ అధికారి మండల శ్రీనివాస్‌ ఎంపికయ్యారు. సింగరేణి ఉన్నత పాఠశాలలో చదువుతూ చదువులో ప్రతిభ కనబర్చిన తుపాకుల ప్రజ్వల శ్రీ, సింగటి సాయి శ్రీ వర్షిణిలు ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. కోలిండియా స్థాయిలో బంగారు పతకాలు సాధించిన ఏరియా ఉద్యోగులు గోలేటి సీహెచ్‌పీలో సీనియర్‌ అసిస్టెంట్‌ జి.మురళీకృష్ణను సన్మానానికి ఎంపిక చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్పొరేట్‌ స్థాయిలో ఎంపికై న ఉత్తమ అధికారిని జూన్‌ 2న కొత్తగూడెంలో జరగబోయే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎండీ సన్మానిస్తారు. ఏరియా స్థాయిలో ఎంపికై న ఉద్యోగులు, విద్యార్థులను గోలేటిలోని భీమన్న స్టేడియంలో నిర్వహించే వేడుకల్లో జీఎం సన్మానించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement