డ్రోన్‌ సాయంతో పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ సాయంతో పరిశీలన

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

రెబ్బెన: కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద జూన్‌ 1న నిర్వహించే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఎస్పీలు నితిక పంత్‌, అఖిల్‌ మహా జన్‌ సంయుక్తంగా పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు చేస్తున్న ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాల ను డ్రోన్‌ సాయంతో పరిశీలించి పోలీస్‌ అధి కారులకు సూచనలు చేశారు. అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌) చిత్తరంజన్‌, డీఎస్పీ అశోక్‌, రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సైలు వెంకటకృష్ణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు

కెరమెరి: సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి మండలంలోని కొత్తగూడ గ్రామంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. బందోబస్తుపై స్థానిక అధికా రులు, సిబ్బందికి సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement