ఇందిరమ్మ ఇళ్లను ముస్తాబు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లను ముస్తాబు చేయాలి

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● కలెక్టర్‌ కె.హరిత

కెరమెరి: ప్రారంభోత్సవాల కోసం ఇందిరమ్మ గృహాలను ముస్తాబు చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జూన్‌ 1న మండలంలోని కొత్తగూడకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో శనివారం గ్రామంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిప్యాడ్‌ నుంచి గ్రామంలోకి వచ్చేదారి వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఆర్డీవో దత్తారావు, ఆర్డీవో లోకేశ్వర్‌, డీపీవో భిక్షపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, విధుల్లో అలసత్వం లేకుండా పనిచేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, మహిళలను తరలించే ప్రతీ బస్సుకు ఇద్దరు ఇన్‌చార్జీలను నియమించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement