అభివృద్ధే లక్ష్యంగా సీఎం జిల్లా పర్యటన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యంగా సీఎం జిల్లా పర్యటన

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

● డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్‌అర్బన్‌: అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్‌ 1న జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం ఏర్పా టు చేసిన సమావేశంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల మంగతో కలిసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతుందని, పీవీటీజీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో పెండింగ్‌ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కెరమెరి మండలం కొలాంకొఠారి పంచాయతీలో 28 ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, సాయంత్రం 4 గంటలకు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల ఆసరా పింఛన్లు మంజూరు చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు తారీఖ్‌, భీంరావు, ప్రధాన కార్యదర్శి గాదెవేణి మల్లేశ్‌, కార్యదర్శి శంకర్‌, నాయకులు దీపక్‌ ముండే, గాజుల జక్కయ్య, వాసుదేవ్‌, తిరుపతి, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement