కాగజ్‌నగర్‌టౌన్: సుదీర్ఘ ఎదురుచూపుల అనంతరం కొత్త పెన్షన్లను జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మున్సిపాలిటీల్లో దరఖాస్తుల పక్రియ ఊపందుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు వార్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని అన్ని వార్డుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులను గుర్తించి వారి ఫొటోలు, ఆధార్ వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.


