ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో జూన్ 3న ఉదయం 11 గంటలకు లోక్ అదాలత్ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య తెలి పారు. జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కరిస్తున్నట్లు వివరించారు. సివిల్, క్రిమిన ల్, ప్రీ లిటిగేషన్, బ్యాంకింగ్, విద్యుత్, భూసమస్యల కేసులు, వివాహం, కుటుంబ కలహాల కేసులు, మోటార్ వెహికిల్ ప్రమాద కేసులు, చిట్‌ఫండ్ చెక్‌బౌన్స్ కేసులతో పాటు కాంపౌండబుల్ కేసులు సమన్వయంతో పరిష్కరించేందకు కృషి చేయాలని సూచించారు.
పరీక్షించి..అవగాహన కల్పించి..
వాంకిడి: మండలంలోని ఇందాని గ్రామంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ –2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించారు. హ్యాండ్ హోల్డ్ ఎక్స్‌రే ద్వారా టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. లక్షణాలు ఉన్న వారిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు పీహెచ్‌సీలో లభించే మందులు క్రమం తప్పకుండా ఆరు నెలలపాటు వాడితే నయం అవుతుందన్నారు. నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రభుత్వం నుంచి క్షయ వ్యాధిగ్రస్తులకు రూ.1000 ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి పెందుర్ రవిదాస్, సర్పంచ్ కోట్నాక నిర్మల, ఉప సర్పంచ్ రమేశ్, పీఎం జన్‌మన్ వైద్యురాలు శ్రీజ తదితరులు పాల్గొన్నారు.


