ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

● అధికారులు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవాలి ● రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఆసిఫాబాద్‌: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌తో కలిసి జిల్లా అధికారులతో పౌష్టికాహారం, ప్రజారోగ్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గవర్నర్‌ మాట్లాడు తూ జిల్లాలో 464 మంది క్షయ వ్యాధిగ్రస్తులు న్నారని, జిల్లా అధికారులు ఒక్కొక్కరిని దత్తత తీసుకుని నెలకు సరిపడా మందులు, పౌష్టికాహా రం అందించాలన్నారు. చికిత్సతో క్షయ వ్యాధి నయమవుతుందని తెలిపారు. యువత మాదకద్రవ్యాలు, మత్తుకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, నషా ముక్త్‌ భారత్‌వైపు అడుగులు వేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాంక్షిత జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కెహరిత జిల్లాలో శాఖల వారీగా చేపడుతున్న సేవలు, సంక్షేమ అభివృద్ధి పనులపై గవర్నర్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఎస్పీ నితిక పంత్‌ జిల్లాలో శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల గురించి వివరించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ సొసైటీలో సభ్యత్వం తీసుకున్న కలెక్టర్‌ హరితకు గవర్నర్‌ ధ్రువపత్రం అందించారు. ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి కలెక్టర్‌, అధికారులు జ్ఞాపికలు అందించారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం

ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి జి ల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్‌ శివప్రసాద్‌ శు క్లాకు ఉదయం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ వద్ద క లెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హ రీశ్‌బాబు, జిల్లా అధికారులు ఘన స్వాగతం ప లికారు. అనంతరం గవర్నర్‌ పోలీసు గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీ వో మంద మకరందు, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, అదనపు ఎస్పీ చిత్తరంజ న్‌, కాగజ్‌నగర్‌ సబ్‌కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement