రెబ్బెన: కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ ప్రాంతంలో జూన్ 1న నిర్వహించే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎస్పీ నితిక పంత్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, ప్రముఖులు వచ్చే రూట్లు, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దన్నారు. అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, డీఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


