విత్తన ఎంపికే కీలకం..! | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం..!

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

● అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొ నుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తున్నాయ ని ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేయవద్దు. ● విత్తనాల ప్యాకెట్‌పై లాట్‌ నంబర్‌, కంపెనీ పేరు, డేట్‌ ఆఫ్‌ ప్యాకింగ్‌, లేబుల్‌, మొలక శాతం సక్రమంగా ఉందో లేదో గమనించాలి. ● విత్తనాలు కొనుగోలు సమయంలో తప్పనిసరి గా సంబంధిత షాపు నుంచి రశీదు పొందాలి. అలాగే విత్తన ప్యాకెట్‌ కవర్‌ను ఇంట్లో భద్రపర్చుకోవాలి. పంట దిగుబడి రాకపోవడం, ఇతర విపత్కర సమయంలో రశీదు ఆధారంగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ● గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు అమ్మే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. లూజ్‌లో అమ్మే విత్తనాలకు దూరంగా ఉండాలి. ● దుకాణాల్లో లేదా ప్రైవేటుగా నకిలీ విత్తనాలు మ్మినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి ఆఫర్లు, దిగుబడి పేరుతో గ్రామాల్లో దళారుల దందా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారుల సూచన

(ఎకరాల్లో)

తిర్యాణి: మరో వారం, పది రోజుల్లో జిల్లాలో వా నాకాలం పంటల సీజన్‌ ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో రైతులు పత్తి, ఇతర పంట చేలు శుభ్రం చేసి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మెజార్టీ రైతులు తమ భూములు దుక్కి దున్నించి విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేశారు. సీజన్‌ ప్రారంభానికి సమయం సమీపిస్తుండటంతో పలు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లో రైతులను సంప్రదిస్తున్నారు. తమ కంపెనీ విత్తనాలనే కొనుగోలు చేయాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధ్రువీకరించిన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే ఊరు, పేరు లేని వాటిని సైతం అంటగట్టే అవకాశం ఉంది.

ఏటా నష్టాలపాలు

జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి 3,70,919 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉండగా, ఆ తర్వాత వరి 42,228 ఎకరాలు, కంది 20,187 ఎకరాలు, ఇతర పంటలు 13,256 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. విత్తనాల స్థితిగతులు పరిశీలించకుండా కొనుగోలు చేస్తుండటంతో ఏటా నష్టాలపాలవుతున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే గ్రామాల్లో హడావుడి మొదలువుతుంది. సమీప ఫర్టిలైజర్‌ షాపులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వివి ధ కంపెనీల ప్రతినిధులు విత్తనాల విక్రయాలకు ప్రయత్నిస్తుంటారు. ఇదే అదనుగా కొందరు వ్యా పారులు తక్కువ ధరకు నాణ్యతలేని విత్తనాలను అంటగడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రై తులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందు కు ఆస్కారం ఉంటుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఎంపికపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా తరచూ ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేస్తున్నారు.

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

పంట సాగు విస్తీర్ణం అవసరమైన విత్తనాలు

పత్తి 3,70,919 7,40,726 ప్యాకెట్లు

వరి 42,228 11,750 క్వింటాళ్లు

కంది 20,187 800 క్వింటాళ్లు

Advertisement
 
Advertisement
Advertisement