ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆ శ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన సిద్దార్థ, సీహెచ్ రోహన్ జాతీయస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్‌లో ఈ నెల 29 నుంచి 31 వరకు జరిగే 44వ జూనియర్ పురుషుల జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని హెచ్‌ఎం చంద్రశేఖర్, పీడీ మధుసూదన్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర షూటింగ్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి, కార్యదర్శి సోమశేఖర్, ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి హరిచరణ్, డీవైఎస్‌వో అశ్వక్ అహ్మద్, డీడీ రమాదేవి, ఏటీడీవో చిరంజీవి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల తదితరులు అభినందించారు.


