తొమ్మిదో రోజుకు రిలే దీక్షలు | - | Sakshi
Sakshi News home page

తొమ్మిదో రోజుకు రిలే దీక్షలు

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎస్పీఎం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ ఆ ధ్వర్యంలో పట్టణంలోని మిల్లు గేటు ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం తొ మ్మిదో రోజుకు చేరాయి. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వా రు మాట్లాడుతూ 2018 నుంచి యూనియన్‌ లేకపోవడంతో వేతన ఒప్పందాలు, ఇతర సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తూ ఎన్నికలు నిర్వహణకు సహకరించకుండా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగు ల సంఘం జిల్లా అసోసియేటెడ్‌ మూలకల సుభాష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మురళీధర్‌రా వు, సంయుక్త కార్యదర్శి పురుషోత్తం, నాయకులు జయదేవ్‌ అబ్రహం, శివప్రసాద్‌, చంద్రమౌళి, అంకయ్య, నరసయ్య, వినోద్‌కుమార్‌, అశోక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement