వాంకిడి: గతంలో పలుమార్లు ప్రభుత్వం హా మీలు ఇచ్చినా అమలుకు నోచుకోలేదని, ఇకనైనా ప్రతినెలా 1న పంచాయతీ కార్మికులకు గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం యూనియన్ నాయకులు, కార్మికులతో సమావేశం నిర్వహించి పలు సమస్యలపై సమీక్షించారు. మూ డు నుంచి ఐదు నెలలుగా పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.


