డోర్లి– 1 ఓసీపీ సందర్శన | - | Sakshi
Sakshi News home page

డోర్లి– 1 ఓసీపీ సందర్శన

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో మూతపడిన డోర్లి– 1 ఓసీపీని ఓఎస్‌డీ(కోల్‌ కంట్రోల్‌ ఆఫీస్‌ కొత్తగూడెం) ఏ.కృష్ణమోహన్‌, ఓఎస్‌డీ(కోల్‌ కంట్రోల్‌ ఆఫీస్‌ నాగ్‌పూర్‌) సతీశ్‌ గజ్‌భియే బుధవారం సందర్శించారు. నీటి నిర్వహణ, మృత్తిక సంరక్షణ చర్యల వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు జీఎం కా ర్యాలయంలో ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్‌ కోల్‌ కంట్రోల్‌ అధికారులకు ఏరియా వివరాలను వివరించారు. డోర్లి ప్రాజెక్టు అధికారి ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్‌, కార్పొరేట్‌ అదనపు మేనేజర్లు సీహెచ్‌.శ్రీనివాస్‌, రవికిరణ్‌, తిరుపతి, బాబ్జీ, డీవైఎస్‌ఎస్‌వో రమేశ్‌, ఏరియా సర్వే అధికారి అఫ్సర్‌ పాషా, డోర్లి– 1 మేనేజర్‌ మహేశ్‌, ఎన్విరాన్‌మెంట్‌ అధికారి హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement