మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మహిళలను ఆర్థిక అభివృద్ధి, సామాజికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని వార్డు నం.6లోని కాపువాడలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా సంఘం సభ్యులకు ఇందిరమ్మ చీరలు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానాతో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శారద, ఐకేసీ సీఏ అరుణ, రేణుక, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement