రెబ్బెన: ప్రతీ ఉద్యోగికి క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యమని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందుతున్న ఆయనను మంగళవారం గోలేటిలో పర్సనల్ డిపార్టుమెంట్ అధికారులు, ఉద్యోగులు సన్మానించారు. జీఎం మాట్లాడుతూ తన 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, సమయపాలనకే అధిక ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తాను సాధించిన విజయాలు, ఎదుర్కొ న్న సంఘటనలను ఉద్యోగులకు వివరించారు. నిబద్ధత, వృత్తిలో బాధ్యత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ హెచ్‌వోడీ ఎస్‌వీ రాజేశ్వర్‌రావు, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, సీనియర్ అసిస్టెంట్ బాబా, అన్ని విభాగాల సంక్షేమ క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు.


