సమష్టి కృషితోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే బాల్య వివాహాలకు అడ్డుకట్ట

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: సమష్టి కృషితోనే బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడుతుందని జిల్లా బాల ల పరిరక్షణ అధికారి బూర్ల మహేశ్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్‌ మండలం కౌటగూడ పంచాయతీలో నిర్వహించిన ‘బాల్య వివాహా ముక్త్‌ భారత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. యువతులకు 18, యువకులకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లిళ్లు జరిపించాలని సూచించారు. పిల్లల రక్షణ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్య వస్థ, పిల్లలపై హింస నివారణలో గ్రామస్థా యి బాల సంరక్షణ కమిటీలు కీలకంగా పని చేయాలని ఆదేశించారు. సూపర్‌వైజర్‌ లైలా, పంచాయతీ కార్యదర్శి శ్వేత, కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement