భాగస్వామ్యమే అభివృద్ధికి బాట | - | Sakshi
Sakshi News home page

భాగస్వామ్యమే అభివృద్ధికి బాట

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

జిల్లాలో ముగిసిన ‘జన్‌భాగీదారి అభియాన్‌’ 241 గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సదుపాయాల కల్పనపై నివేదికలు రూపొందించిన అధికారులు

కెరమెరి: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఆదిమ గిరిజనులు, ఇతర గిరిజనుల భాగస్వామ్యం పెంచి, వారిని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన జన్‌భాగీదారి అభియాన్‌ విజయవంతంగా ముగిసింది. గిరిజన శాఖ సిబ్బంది, గిరిజన సంక్షేమ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంపిక చేసిన గ్రామాల్లో తిరుగుతూ విస్తృతంగా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, తాగునీటి వసతుల కల్పనపై వివరాలు సేకరించి నివేదికలు రూపొందించారు.

ర్యాలీలు, గ్రామసభలు..

ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. 341 గ్రామ సభలు, 241 ర్యాలీలు నిర్వహించి గూడెలను చైతన్యపర్చారు. 168 ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. రక్తనమూనాలు సేకరించి మందులు అందించారు. సికిల్‌ సెల్‌, క్షయ, డయాబెటీస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు. 1,080 మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులు, ఆధార్‌ కార్డులు అందించారు. జనసన్వాయి(గ్రామ సభలు) కార్యక్రమాలు విజ యంతంగా నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకా లు, రేషన్‌ కార్డులు, తదితర అంశాలపై సమీక్షించా రు. ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, పటేళ్లు, గ్రామస్తులను భాగస్వాములను చేశారు. గిరిజన పిల్లలకు చాలామందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేనట్లుగా గుర్తించి సంబంధిత అధికారులతో చ ర్చించి సమస్యలు పరిష్కరించారు. సదుపాయాల కల్పనపై రూపొందించిన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

సమగ్ర నివేదిక సిద్ధం

జిల్లాలోని 241 ఆవాసాల్లో జన్‌భాగీదారి కార్యక్రమం ముగిసింది. ఆయా గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేశాం. త్వరలో ఉన్నతాధికారులకు సమర్పిస్తాం. ప్రజలకు అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించాం.

– పి.రమాదేవి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి

241 గ్రామాల్లో..

జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం జన్‌మన్‌, పీఎంజుగా వంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఈ ఏడాది జన్‌ భా గీదారి అభియాన్‌ అనే కార్యక్రమం కింద జి ల్లాలోని 241 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు చేపట్టారు. జన్‌భాగీదారి కార్యక్ర మం ఉద్దేశం, తీరుతెన్నులను గ్రామీణులకు వివరించారు. కలెక్టర్‌ హరిత, ఐటీడీఏ ప్రాజె క్టు అధికారి మంద మకరందు ఆధ్వర్యంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పి.రమాదేవి, పీఏఆర్‌సీ ఏఎంవో ఉద్దవ్‌ పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement