సీఎం సభకు లోటుపాట్లు రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

సీఎం సభకు లోటుపాట్లు రానీయొద్దు

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

● ఎస్పీ నితిక పంత్‌

రెబ్బెన: జిల్లా పర్యటనలో భాగంగా జూన్‌ 1న ఏర్పాటు చేసే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. రెబ్బెన మండలం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద సభాస్థలిని మంగళవారం పరిశీలించారు. వాహనాలకు కేటాయించిన పార్కింగ్‌ స్థలాలు, హెలిప్యాడ్‌ ప్రాంతాలను పరిశీలించి పోలీస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పార్కింగ్‌, సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. రూట్‌మ్యాప్‌ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌, సీఐలు సంజయ్‌, సత్యనారాయణ, ఎస్సై వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హెడ్‌కానిస్టేబుల్‌కు నివాళి

వాంకిడి: రెబ్బెన మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ జాడి బాపురావుకు మంగళవారం ఎస్పీ నితిక పంత్‌ నివాళులర్పించారు. స్వగ్రామమైన వాంకిడి మండలం బంబార గ్రామానికి ఆయన మృతదేహాన్ని తీసుకురాగా, ఎస్పీ పోలీస్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయం కింద రూ.30 వేలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ(అడ్మిన్‌) చిత్తరంజన్‌, డీఎస్పీ అశోక్‌, జిల్లా పోలీస్‌ సంఘం అధ్యక్షుడు విజయ్‌ శంకర్‌రెడ్డి, సీఐలు వేణుగోపాల్‌, శ్రీనివాస్‌, వామన మూర్తి, సంజయ్‌, ఎస్సైలు వెంకటకృష్ణ, మహేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement