ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించడంతో జిల్లా అటవీశాఖలో బీట్ అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయంలో మంగళవారం డీఎఫ్‌వో బాలామణి, ఎఫ్‌డీవో అప్పయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్‌టీవో వేణుబాబు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం జిల్లాలోని రెండు డివిజన్లలో మొత్తం 45 మంది బీట్ అధికారులు బదిలీలకు అర్హత సాధించారని తెలిపారు. వీరికి 11 రేంజ్‌లలో 45 బీట్‌లను కేటాయించామన్నారు. ప్రస్తుతం వారు పనిచేస్తున్న బీట్ సర్వీస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి బదిలీలు చేపట్టామని తెలిపారు. అంతకు ముందు యూనియన్ నాయకులతో సమావేశమై.. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు, జూనియర్ ఫారెస్టు అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సభ్యులు సాయిచరణ్, సద్దాం, స్వప్న, అనిల్, మోహన్, శ్రావణ్ పాల్గొన్నారు.


