రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేడుకల కోసం భీమన్న స్టేడియం, జీఎం కార్యాలయాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో ఖైరిగూర పీవో నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, డీవైసీఎంవో పాండురంగాచారి, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


