ముగిసిన సమ్మర్‌ క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సమ్మర్‌ క్యాంపులు

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజాపాలన– ప్రగతి పా లన కార్యక్రమంలో భాగంగా 15 రోజులుగా జిల్లాలోని పీఎంశ్రీ, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్‌ క్యాంపులు సోమవా రం ముగిశాయి. జిల్లా కేంద్రంలోని తెలంగా ణ మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి డీఈవో లలిత హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కు బహుమతులు ప్రదానం చేశారు. డీఈవో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు కళలు కూడా అవసరమన్నారు. అవసరమైన నైపుణ్యాలు సాధించాలని, అప్పుడే జీవితంలో నిలబడతారని పేర్కొన్నారు. అనంతరం యోగా, నృత్యాలు, ఇతర ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ ఉప్పులేటి శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement