కౌటాల: సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో రోళ్లు పగిలేలా ఎండ దంచి కొండుతుందనే నానుడి ఉంది. ఈ క్రమంలోనే కార్తె ప్రారంభం రోజు వడగాలులు బెంబేలెత్తించాయి. దహెగాం మండలం కుంచవెల్లి, కాగజ్‌నగర్‌లో 46.4 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జంబుగ, సిర్పూర్(టి) 46.3, గోలేటి, చింతలమానెపల్లి 46.0, దహెగాం 45.9, పెంచికల్‌పేట్, లోనవెల్లి, కౌటాల 45. 8, తిర్మాణి 45.5, బెజ్జూర్ 45.4, రెబ్బెన 45.3, వెంకట్రావ్‌పేట 45.1, వంకులంలో 45.0 డిగ్రీలుగా నమోదైంది.


