ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్‌వో వేణుతో కలిసి అర్జీదారుల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన భూమిని భూ భారతి పోర్టల్‌లో ఆన్‌లైన్ చేసి పాస్‌పుస్తకంలో న మోదు చేయాలని ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన నగేశ్ విన్నవించాడు. ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా ఇటీవల విధుల నుంచి తొలగించారని, తిరిగి నాకు ఉపాధి చూపాలని సిర్పూర్(యు) మండలం మహగాం గ్రామానికి చెందిన కొడప హీరామన్ వినతిపత్రం అందించాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిర్పూర్(యు) మండలం కోహినూరు గ్రామానికి చెందిన మండాడి రంభ దరఖా స్తు చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనకు ఆర్థికసాయం అందించాలని పెంచికల్‌పేట్ మండలం చేడ్వాయి గ్రామానికి చెందిన రాజయ్య కోరాడు. దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సాహస్తి, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ఆసిఫాబాద్‌లోని బ్రాహ్మణవాడకు చెందిన ఢిల్లీ విజయ్‌కుమార్ వేర్వురుగా దరఖాస్తు చేసుకున్నా రు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్తాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పింఛన్ మంజూరు చేయాలి
నేను దివ్యాంగురాలిని. ప్ర స్తుతం ఒకరి సహాయం లే కుండా నడవలేని పరిస్థితి. 75శాతంతో సదరం సర్టిఫికె ట్ ఉన్నా దివ్యాంగ పింఛన్ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందవుతుంది. అధికారులు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలి. – ఎం.భారతి, గోలేటి, మం.రెబ్బెన


