ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ నెల 30 వరకు జిల్లా మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నిర్వహించే మహిళా వారోత్సవాలు విజయవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం డీఆర్‌వో దాసరి వేణు, జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. తొలిరోజు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ నెల 26న ‘బాల్య వివాహం– బతుకు ఆగం’ నినాదంతో బాల్యవివాహాలతో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, 27న మహిళల భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించడం, మండల సమాఖ్యలో ప్రత్యేక సాధారణ సమావేశాలు నిర్వహించాలన్నారు. 29న రుణ మేళాలు, స్వయం సహాయక సంఘాల జీవనోపాధిపై, యూనిట్ల రౌండింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. 30న అమ్మ మాట– అంగన్‌వాడీ బాట నినాదంతో పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ, విద్య ఆరంభ ధ్రువపత్రాల జారీ, కిశోర బాలికల కోసం స్నేహ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
మహిళల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నుంచి మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం వివిధ వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్‌ల నిర్వహణతో తోడ్పాటునందించామని పేర్కొన్నా రు. స్వయం సహాయక సంఘాలకు భవిష్యత్తులో రైస్ మిల్లుల స్థాపన, నిర్వహణ అప్పగిస్తామని తెలి పారు. మహిళా శక్తి సూపర్ బజార్ల ఏర్పాటుకు ప్ర భుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించా రు. కలెక్టర్ కె.హరిత, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


