ఆసిఫాబాద్: 2017 పేస్కేల్ ఏరియర్స్, ఇతర ఏరి యర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు సోమవారం జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా వివిధ హోదా ల్లో ఉద్యోగాలు చేసి, రిటైరైన తాము తొమ్మిదేళ్లుగా రూ.3, 4 వేల పెన్షన్‌తో కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి ఉన్న 2017 పేస్కేలు 2024 ఏప్రిల్‌లో సర్వీసులో ఉన్న వారందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశా రు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి నెలకు రూ. 400 కోట్లు వస్తున్నందున బకాయిలు చెల్లించడం సంస్థకు ఇబ్బంది కాదని స్పష్టం చేశారు. పిల్లల చ దువులు, వివాహాలు, అనారోగ్య సమస్యలకు చేసి న అప్పులు తీర్చలేకపోతున్నామన్నారు. యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్య క్రమంలో విశ్రాంత ఉద్యోగులు మోతె రాజన్న, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


