కెరమెరి: యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని తుడుదెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూ రియా యాప్ సామాన్య రైతుల పాలిట శా పంగా మారిందని ఆరోపించారు. 80శాతం మంది రైతుల వద్ద మొబైల్ ఫోన్‌లు లేవని తెలిపారు. మొబైల్‌ఫోన్లు ఉన్నవారికి కూడా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునే వి ధానం తెలియదని పేర్కొన్నారు. యాప్‌లో యూరియా బుక్ చేసుకునే విధానాన్ని రద్దుచేసి, పాత పద్ధతిలో యూరియా విక్రయించాలని డిమాండ్ చేశారు. నాయకులు సెడ్మికి తుకారాం, మడావి భరత్ భూషణ్, ఆత్రం భీంరావు, కినక సకారాం, గిత్తే కిరణ్, వాడ్గూ రే నానాజీ తదితరులు పాల్గొన్నారు.


