ఖరీఫ్‌నకు సిద్ధమవుతున్న రైతులు జిల్లాలో 4.52లక్షల ఎకరాల్లో సాగు పత్తికే సై.. అంటున్న అన్నదాతలు 3.70లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధం ఎరువుల లభ్యతపైనే ఆందోళన
ఆసిఫాబాద్: జిల్లాలో పత్తి సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చే సుకుంటున్నారు. మరో పక్షం రోజుల్లో మృగశిర కార్తె ప్రవేశించనున్నందున ఉదయం నుంచే పను ల్లో నిమగ్నమవుతున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నా రు. గతంలో ఎరువుల దుకాణాల్లో నేరుగా యూరి యా లభించేది. దీంతో షాపుల ఎదుట వందల సంఖ్యలో రైతులు బారులు తీరేవారు. కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చే యకపోవడం, రాష్ట్రంలో నిల్వలు లేకపోవడంతో రై తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారికంగా యూరియా నిల్వలు సరిపోతాయని భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వా నాకాలం సాగుకు రాష్ట్రానికి 11.50 లక్షల టన్నుల యూరియా అవసరమున్నట్లు ప్రభుత్వం కోరగా, వివిధ కారణాలతో ప్రభుత్వం 10 లక్షల టన్నులకే అనుమతిచ్చింది. ఏప్రిల్, మే మాసాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి డిమాండ్‌కు తగిన యూరియా సరఫరా కాకపోవడంతో దీని ప్రభావం జిల్లాపై పడే అవకాశాలున్నాయి.
జిల్లాలో 4.52 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో 2026–27 సంవత్సరానికి ఖరీఫ్‌లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47వేల ఎకరాల్లో వరి, 21వేల ఎకరా ల్లో కంది, 7.5వేల ఎకరాల్లో మక్క, 5,700 ఎకరా ల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. 7.41లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 11వేల క్వింటాళ్ల వరి, 613 క్వింటాళ్ల మొక్కజొన్న, 842 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమున్నాయి. 60వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ప్రస్తుతం జిల్లాలో 11వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. 22వేల క్వింటాళ్ల డీఏపీ అవసరముండగా 400 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
కొరవడిన అవగాహన
సేంద్రియ సాగును పెంచాలని అధికారులు సూచి స్తున్నా రైతులు రసాయన ఎరువులతోనే పత్తి సాగు కు మొగ్గు చూపుతున్నారు. చీడపురుగుల నివారణ కు రసాయన ఎరువులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గుతోంది. ఇంటికి అవసరమైన మేరకే ఆహార పంట లు సాగు చేస్తూ మిగతా భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రై తులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు లేదు.
రైతులు ఆందోళన చెందొద్దు
దశలవారీగా నెలనెలా జిల్లాకు యూరియా, డీఏపీ సరఫరా అవుతోంది. మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎకరాకు మూడు బస్తాల యూరియా మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదులో వేస్తే దిగుబడి తగ్గుతుంది. జిల్లాలో ఎరువుల కొరత ఉండదు. రైతులు ఆందోళన చెందొద్దు.
– వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి
ప్రారంభం కాని మొబైల్ యాప్
యూరియా పంపిణీలో పారదర్శకత ఉండేలా గతేడాది డిసెంబర్ 20నుంచి ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా పంపిణీని అమల్లోకి తెచ్చింది. తా జాగా వానాకాలం పంటలకూ ఇలాగే పంపిణీ జరగనుంది. ఖరీఫ్ సమీపిస్తుండగా మొబైల్ యాప్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. వేసవిలో యూరియా, డీఏపీ లభిస్తే రైతులు తమ పంట చేల వద్ద భద్రపరుచుకుంటారు. వర్షాలు వస్తే పంట పొలాల్లోకి ఎరువులను తరలించడం ఇబ్బందవుతుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే రైతులు ఎరువుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా రైతులకు ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా రెండింటికే పరిమితం చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఫర్టిలైజర్స్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో యాప్ తొలగించాలని కోరుతూ కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. ఎరువుల కేటాయింపులు మూడు దశల్లో ఇస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.


