‘సన్‌’డే భగభగలు | - | Sakshi
Sakshi News home page

‘సన్‌’డే భగభగలు

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

● జిల్లావాసులను ఉడికిస్తున్న ఎండలు! ● జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ● కుంచవెల్లిలో 46.5 డిగ్రీల టెంపరేచర్‌

కౌటాల/ఆసిఫాబాద్‌: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. జిల్లాలోని దహెగాం మండలం కుంచవెల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. దీంతో ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వర కు వడగాలులు వీస్తుండగా జనం బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలిలో తేమ తగ్గిపోవడంతో పాటు అధిక వేడికి తోడు వడ గాలులు వీస్తున్నందున జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులు, ముఖ్య కూ డళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలోని 11 మండలాలు రెడ్‌ జోన్‌లో, మిగతా మండలాలు అలర్ట్‌ జోన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇళ్లకే పరిమితమవుతున్న జనం

వారం రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలకు అతుక్కుపోయి ఉపశమనం పొందుతున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్తున్నారు. ఎండ తీవ్రతకు దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో ప్రజలు లేక బోసిపోతున్నాయి.

ఆదివారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు

ప్రాంతం గరిష్టం (సెల్సియస్‌లో)

కుంచవెల్లి 46.5

కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) 46.3

లోనవెల్లి 46.2

తిర్యాణి 46.1

రెబ్బెన, జంబుగా 45.9

ఆసిఫాబాద్‌ 45.8

ఎల్కపల్లి 45.7

గోలేటి, దహెగాం 45.6

చింతలమానెపల్లి 45.5

కౌటాల 45.2

వెంకట్రావ్‌పేట 45.1

బెజ్జూర్‌, రెబ్బెన 45.0

Advertisement
 
Advertisement
Advertisement