ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మె డికల్ కళాశాలకు తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని పద్మశాలీ సంఘం నాయకులు ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆ త్రం సుగుణను కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ మాట్లాడారు. మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించిన ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకొని వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అసంపూర్తిగా నిలిచిన పట్టణంలోని పద్మశాలీ సంఘ భవ న నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన డీసీసీ అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పద్మశాలీ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో సంఘం పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి శ్రీకాంత్ తదితరులున్నారు.


