కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

ఆసిఫాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించా రు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వివిధ ప్రాంతాల నుంచి రా ష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా భ ట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోపు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా వా యు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ.. జిల్లాలో నిబంధనల ప్రకా రం కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తించి న గోదాములకు కేటాయించిన ప్రకారం రైస్‌ మిల్ల ర్లకు ధాన్యం తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగో లు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించి సీఎంఆర్‌ ప్రక్రియ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement