మోసగించే ముఠాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మోసగించే ముఠాలపై అప్రమత్తంగా ఉండాలి

May 24 2026 12:09 AM | Updated on May 24 2026 12:09 AM

వాంకిడి: ఉపాధి పేరిట మోసగించే ముఠాల విషయంలో మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని లీగల్‌ సర్వీసెల్‌ అథారిటీ సెక్రటరీ సంకేత్‌ మిశ్రా సూచించారు. శనివా రం మండలంలోని బంబార గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణా, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించడమే పోక్సో చట్టం ఉద్దేశమని తెలి పారు. ఈ చట్టం కింద బాధితుల పేర్లు గో ప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు భయపడకుండా ముందుకురావాలని సూ చించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ అనంతలక్ష్మి మాట్లాడుతూ.. పిల్లలు సెల్‌ఫోన్‌లో అపరిచి తులతో చాటింగ్‌ చేయడం, ఫొటోలు, వీడియోలు పంపడం లాంటివి చేయకూడదని తె లిపారు. పిల్లలు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు కనిపెట్టాలని సూ చించారు. అసిస్టెంట్‌ లీగల్‌ కౌన్సిల్‌ అంజనీదేవి, డీడబ్ల్యూవో శారద, జెండర్‌ స్పెషలిస్ట్‌ రాణి, రాజేశ్వరి, సర్పంచ్‌ బెండారె కృష్ణాజీ, ఉప సర్పంచ్‌ సంతోష్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement