రెబ్బెన: జూన్ 2న మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ప్రజ లు అధికసంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కోరారు. శనివా రం మండల కేంద్రంలోని కేకే గార్డెన్స్‌లో పార్టీ మండల ముఖ్య కార్యకర్తలతో బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అధికసంఖ్యలో సభకు తరలివచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభ విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రావు, అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, జిల్లా కా ర్యదర్శి దుర్గం దేవాజీ, చిరంజీవిగౌడ్, నాయకులు సోమశేఖర్, ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


