ఆలయాల్లో ఆడిట్‌ అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో ఆడిట్‌ అధికారుల తనిఖీలు

May 24 2026 12:09 AM | Updated on May 24 2026 12:09 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో శనివారం ఆడిట్‌ అధికారులు పాండురంగ, ఏకనాథ్‌ తనిఖీలు నిర్వహించారు. ఆలయాలకు దూపదీప నైవేద్యాల ఖర్చులు, అర్చకులకు వేతనాలు సక్రమంగా అందుతున్నాయా? అర్చకులు రోజూ ఆలయాల్లో పూ జలు చేస్తున్నారా? అని ఆరా తీశారు. కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతుండడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 18నుంచి 26వరకు ఆడిట్‌ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గణపతి, కేస్లాపూర్‌ వీరాంజనేయస్వామి, కంచుకోట హనుమాన్‌, మహాలక్ష్మి, బాలేశ్వరస్వామి, సోమనాథ్‌, సందీప్‌నగర్‌ శివాలయం, అయ్యప్పస్వామి ఆలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement