నిధుల్లేక సుస్తీ..! | - | Sakshi
Sakshi News home page

నిధుల్లేక సుస్తీ..!

May 24 2026 12:09 AM | Updated on May 24 2026 12:09 AM

అస్తవ్యస్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు

నాలుగేళ్లుగా పత్తా లేని హెచ్‌డీఎఫ్‌

కమిటీలు లేక కానరాని అభివృద్ధి

పేషెంట్లకు నామమాత్రపు సేవలే..

కెరమెరి: ఏటా రావాల్సిన ఆస్పత్రి అభివృద్ధి నిధులు (హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) నాలుగేళ్లుగా నిలిచాయి. దీంతో 2023 నుంచి ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వ దవాఖానా ల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చీపుర్లు, బకె ట్లు, ఇంటర్నెట్‌, కంప్యూటర్ల మరమ్మతుకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఆస్పత్రి అ భివృద్ధి నిధులు విడుదల చేయకపోవడంతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల నిర్వహణ గాడి తప్పింది. వీటిలో సమస్యలు పేరుకుపోతున్నాయి. జాతీయ ఆరోగ్యమిషన్‌ ద్వారా ప్రతీ పీహెచ్‌సీ, ఇతర వైద్యశాలలకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు నాలుగేళ్లుగా నిలిచి ఏ చిన్న అవసరమున్నా.. ఏదైనా వస్తువు కొనాల న్నా వైద్యులు జేబులోంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 20 పీహెచ్‌సీలు, ఐదు సీహెచ్‌సీలుండగా వీటిలో వసతులు మెరుగుపరుచుకోవడానికి ఇబ్బందులకు గురి కావాల్సిన దుస్థితి ఉంది.

అభివృద్ధి గురించి అడిగే నాథులేరి?

మండల పరిషత్‌ అధ్యక్షుల పదవీకాలం ఏడాది కిందట ముగియడంతో పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. కమిటీలున్నా కనీసం నిధుల గురించి అడిగే పరిస్థితి ఉండేది. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి ప్రతీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి నిత్యం 80నుంచి 120మంది రో గులు వస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఉదయం పూట రోగుల సంఖ్య అధికంగా ఉంటోంది. రోగులకు సరైన వైద్యం అందుతుందా? లే దా అస్పత్రులకు ఏవైనా అవసరాలున్నాయా? అని అడిగే నాథులే లేరు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులు నిర్వహణ లేక సమస్యల్లో కూరుకుపోయాయి. ఫలితంగా రోగులు అవస్థలు పడుతున్నారు.

ఏడాదికి రూ.1.75 లక్షలు ఎటుపాయే..

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సివిల్‌ ఆస్పత్రులకు ఏటా ప్రభుత్వం నిర్వహణ నిధుల కోసం రూ.1.75 లక్షల చొప్పన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ మంజూరు చేసేది. 2023 తర్వాత ఈ నిధులు నిలిచిపోయాయి. గతంలో ఈ నిధులతో ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు మౌలిక సదుపాయాలు కల్పించేవారు. దీంతో పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా సదుపాయాలు, కనీస సౌకర్యాలు కల్పించడానికి వై ద్య సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వి ద్యుత్‌ బల్బులు, చీపుళ్లు, శానిటరీ వస్తువులు కొనా లన్నా, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, పాడైన కంప్యూటర్లకు మరమ్మతు చేయించాలన్నా, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలన్నా, స్టేషనరీ ఖర్చులు చెల్లించాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటన్నంటికీ కనీసం నెలకు ఒక్కో ఆస్పత్రికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అవసరముంటుంది. కానీ, నిధులు విడుదల కాపోవడంతో ఖర్చు పెట్టేవారు లేక ఆస్పత్రులు నిరాదరణకు గురవుతున్నాయి. అయితే, జిల్లాలోని కొన్ని పీహెచ్‌సీలకు రెగ్యులర్‌ వైద్యులు లేకపోవడంతో పీఎం జన్‌మన్‌ వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. పీఎం జన్‌మన్‌ వైద్యులకే సరిగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారు నిర్వహణ ఖర్చులు భరించే పరిస్థితి ఉండదు. రెగ్యులర్‌ వైద్యులు ఎలాగైనా ఎంతో కొంత ఖర్చు చేస్తున్నప్పటికీ ఇతరులు ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement