నేటి నుంచి సామర్థ్యాల అంచనా సర్వే
ఆసిఫాబాద్‌రూరల్: ఎఫ్‌ఎస్‌ఎస్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి రెండో తరగతి విద్యార్థులకు సామర్థ్యాల అంచనా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బీఈడీ, డీఈడీ చదువుతున్న 53 మంది ఛాత్రోపాధ్యాయులకు అసెస్మెంట్‌పై జిల్లా కేంద్రంలోని శ్రీనిధి కళాశాలలో మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి 27 వరకు పాఠశాలకు వెళ్లి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు టాన్జనిన్ యాప్ ద్వారా పారదర్శకంగా సామర్థ్యాలపై అసెస్మెంట్ చేస్తారని తెలిపారు. సర్వే నిర్వహించే తేదీల్లో మూడు రోజులపాటు రెండో తరగతి విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లు ప్రశాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


