భయంగా ప్రయాణం
మా గ్రామానికి వెళ్లే రహదారిపై ఉన్న కల్వర్టులు వరదలకు కొట్టుకుపోయాయి. కోతకు గురై భారీ గుంత ఏర్పడి నాలుగేళ్లు గడిచింది. పంగిడిమాదర నుంచి ఫూల్సింగ్‌తండా వరకు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలి. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. – రాథోడ్ అనిల్ కుమార్, ఫూల్సింగ్‌తండా, మం.లింగాపూర్
హైలెవల్ వంతెన నిర్మించాలి
వర్షాకాలంలో తుంపెల్లి వంతెన పైనుంచి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచిపోతాయి. 20 గ్రామాల ప్రజలు ఈ దారి గుండానే వెళ్లాలి. రక్షణ లేకపోవడంతోపాటు ఇరుకుగా ఉంది. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా పట్టించుకోవడం లేదు. వెంటనే హైలెవల్ వంతెన నిర్మించాలి.
– మల్లేశ్, తుంపెల్లి, మం.ఆసిఫాబాద్
భయంగా ప్రయాణం


