జిల్లా పోలీసులకు పతకాలు
ఆసిఫాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన నాలుగో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు పోలీసులు పతకాలు సాధించారు. సెపక్‌తక్రాలో కానిస్టేబుళ్లు పొట్ట గోపి, కిరణ్‌కుమార్, రాజేశ్ సిల్వర్ మెడల్స్ సాధించగా, మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్(ఓపెన్)లో కానిస్టేబుల్ సువార్త సిల్వర్ మెడల్, కానిస్టేబుల్ ఫూల్‌సింగ్ బాక్సింగ్‌లో సిల్వర్ మెడల్, తైక్వాండోలో బ్రాంజ్ మెడల్ సాధించారు. కానిస్టేబుల్ వినయ్‌కుమార్ తైక్వాండోలో బ్రాంజ్‌మెడల్ సాధించారు. ఎస్పీ నితిక పంత్ జిల్లా కేంద్రంలో మంగళవారం విజేతలను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.


