స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ | - | Sakshi
Sakshi News home page

స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ

Feb 23 2026 7:03 AM | Updated on Feb 23 2026 7:03 AM

స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ

స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ

రెబ్బెన: స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యక్రమాలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం ఎం.నరేందర్‌ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రపంచ ఆలోచన దినోత్సవం నిర్వహించారు. స్కౌట్స్‌ అండ్స్‌ గైడ్స్‌ పితామహుడు బడెన్‌ పావెల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్కౌట్స్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు, గురువులు సర్వమత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడెన్‌ పావెల్‌ జయంతి సందర్భంగా 165 దేశాల్లో ఆలోచన దినోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. తమ సొంత ఆలోచనలతో అటవీ ప్రాంతంలో క్యాంపు వేసుకుని ఎలా జీవించాలో చూపే ప్రదర్శన బాగుందని కితాబిచ్చారు. కార్యక్రమాల్లో పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనివాస్‌, హెచ్‌ఎం అర్లారెడ్డి, స్కౌట్స్‌ మాస్టర్‌ భాస్కర్‌, గైడ్స్‌ కెప్టెన్‌ కరిష్మా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement