డీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక
కాగజ్‌నగర్‌టౌన్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా పొర్శెట్టి నాందేవ్, ఉపాధ్యక్షులుగా నాగోరా వు, భువనేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివా స్, కార్యదర్శులుగా మోహన్, ధర్మయ్య, రవీంద్రచారితో పాటు రాష్ట్ర కౌన్సిలర్‌గా విస్తారును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డీటీఎఫ్ కృషి చేస్తుందని వారు అన్నారు. ప్రభుత్వం పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.


