ప్రశాంతంగా టీజీసెట్
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీక్ష(టీజీసెట్) ప్రశాంతంగా ముగిసింది. 23 కేంద్రాల్లో 5,847 మంది విద్యార్థులకు 5,645 మంది హాజరు కాగా, 202 మంది గైర్హాజరయ్యారు. 5వ తరగతిలో 2,296 మందికి 2,230 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరయ్యారు. అలాగే 6వ తరగతిలో 1,681 మందికి 53 మంది గైర్హాజరు కాగా 1,678 మంది పరీక్ష రాశారు. 7వ తరగతిలో 683 మందికి 656 మంది హాజరయ్యారు. 27 మంది హాజరు కాలేదు. 8వ తరగతి 745 మందికి 709 మంది హాజరుకాగా, 36 పరీక్ష రాయలేదు. 9వ తరగతిలో 442 మందికి 422 మంది హాజరు కాగా, 22 మంది గైర్హాజరయ్యారని డీసీవో శారద తెలిపారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల, కాగజ్‌నగర్‌లో పలు కేంద్రాలను డీసీవో తనిఖీ చేశారు.
మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి
జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద హాల్‌టికెట్ నంబర్ చూసుకుంటున్న విద్యార్థులు
ప్రశాంతంగా టీజీసెట్


