
‘ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తాం’
బెజ్జూర్(సిర్పూర్): భారీ వర్షాలతో ప్రాణహి త నది ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహా రం అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండలంలో ప్రాణహిత వరదతో మునిగిన పంటలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూర్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో గతంలో పరిహారం అందించారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు. సమస్యలు ఉంటే తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పంద్రం పుష్పలత, జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, టాకిరే శ్రీనివాస్, రాచకొండ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.