
బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కెరమెరి(ఆసిఫాబాద్): బ్యాంకు సేవలను రైతులు, సామాన్య ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బీఐ డీజీఎం టి.జగదీశ్‌కుమార్ అన్నారు. మండలంలోని కొఠారిలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జన సురక్ష ప్రోగ్రాం ఎంతో ప్రతిష్టాత్మకమైందని, బ్యాంకు సేవలపై పంచాయతీల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ ని తెలిపారు. కొత్త, పాత బ్యాంకు ఖాతాలు పదేళ్లుగా వాడకపోయినా తిరిగి యాక్టీవ్ చేయడం, పీఎం జేబీఎస్, పీఎం ఎస్‌బీవై, ఏపీవై పథకాలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలన్నారు. డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ ఎల్‌డీవో వెన్న శ్రీనివాస్, మంచి ర్యాల ఆర్‌ఎం రితీష్ కుమార్ గుప్తా, ఆసిఫాబాద్ ఎల్‌డీఎం రాజేశ్వర్‌జోషి, అడ, కెరమెరి బ్యాంకు మేనేజర్లు నందన్, శ్రీపాద్, ఎంపీడీవో అంజద్‌పాషా తదతరులు పాల్గొన్నారు.