
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్ర శాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఫస్టియ ర్ ఇంగ్లిష్ పరీక్షకు 648 మంది విద్యార్థులకు 606 మంది హాజరు కాగా 42 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 562 మంది విద్యార్థులకు 530 మంది హాజరు కాగా.. ఒకేషనల్ విభాగంలో 86 మంది విద్యార్థులకు 76 మంది హాజరయ్యారని డీఐఈవో శంకర్ తెలిపారు. మధ్యాహ్నం సెకండియర్ పరీక్షకు 178 మంది విద్యార్థులకు 172 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 159 మంది విద్యార్థులకు 154 మంది హాజరు కాగా ఒకేషనల్ విభాగంలో 19 మందికి 18 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో తనిఖీ చేశారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ