ఆసిఫాబాద్: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా అత్మారాంనాయక్ బుధవారం ఆసిఫాబాద్‌లో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆత్మారాంనాయక్‌తోపాటు ఆయన సతీమణి సంధ్య నామినేషన్లు వేయగా, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఉట్నూర్‌కు చెందిన ఎన్.తిరుపతి నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి వేణు తెలిపారు. దీంతో ఆసిఫాబాద్‌లో ఇప్పటివరకు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
సిర్పూర్‌లో ఒకటి..
సిర్పూర్(టి): ఐదో రోజు బుధవారం సిర్పూర్ నియోజకవర్గంలో ఒకే నామినేషన్ దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు తరఫున మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు కొండ్ర మోహన్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు మండల కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ ఈ నెల 10న సిర్పూర్(టి)లో ఎంపీ బండి సంజయ్ పర్యటన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్‌గౌడ్, తిరుపతిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.