దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ

దివ్యాంగ విద్యార్థిని ప్రతిభ

దహెగాం: హైదరాబాద్‌లోని దోమలగూడలో ఈ నెల 17న రాష్ట్రస్థాయి ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 50 మీటర్ల పరుగు పందెంలో దహెగాం మండల కేంద్రానికి చెందిన రెడ్డి దీపిక రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి ప్రతిభ చూపింది. మండల కేంద్రంలోని ముత్యంపేట ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సర్పంచ్‌ జయలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్‌ విద్యార్థిని అభినందించారు. శారీర క పరిమితులను అధిగమిస్తూ ధైర్యంగా పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం గొప్ప వి షయమని కొనియాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు కిషన్‌రావ్‌, సుప్రియ, ఉప సర్పంచ్‌ సురేశ్‌, వార్డు సభ్యుడు ప్రశాంత్‌, టీచర్లు, సీఆర్పీలు ప్రియాంక, రవీందర్‌, చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement