‘వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌ బ్రిడ్జి’ | - | Sakshi
Sakshi News home page

‘వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌ బ్రిడ్జి’

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

‘వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌ బ్రిడ్జి’

‘వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌ బ్రిడ్జి’

రెబ్బెన: వన్యప్రాణుల రాకపోకల కోసం తక్కళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై అనిమాల్‌ అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించినట్లు రెబ్బెన రేంజ్‌ అధికారి కె.భానేశ్‌ తెలిపారు. తెలంగాణ ఫారెస్టు అకాడమీకి చెందిన 40 మంది ట్రైనీ బీట్‌ అధికారులు స్టడీ టూర్‌లో భాగంగా శుక్రవారం రెబ్బెన రేంజ్‌ పరిధిలో పర్యటించారు. ఎఫ్‌ఆర్‌వో వారికి అనిమల్‌ అండర్‌ పాస్‌ వంతెన ఆవశ్యకతను వివరించారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కావడంతో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఉంటుందన్నారు. జాతీయ రహదారి ఏర్పాటుతో వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్షన్‌ అధికారులు సద్దాం, రవి, బీట్‌ అధికారులు రాజేశం, దేవేందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement