వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

రెబ్బెన: కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింద ని జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి ఉప్పులే టి శ్రీనివాస్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధన కోసం ఏఐ విద్యాబోధనను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏఐఏ ఎక్సెల్‌ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 14 పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన సాగుతోందని, సింగరేణి సంస్థ సహకారంతో తాజాగా రెబ్బెన ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలోనూ ప్రారంభించామన్నారు. 27 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో రెబ్బెన స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం విజయరాణి, స్థానిక హెచ్‌ఎం అడ్డూరి లావణ్య, ఉపాధ్యాయుడు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement